ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి ఇల్లంతకుంటలో ఎమ్మెల్యే కవ్వంపల్లి కాకతీయ, ఇల్లంతకుంట: మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో విస్తృతంగా పర్యటించారు. కందికట్కూర్ గ్రామంలో నిర్వహిస్తున్న ఎల్లమ్మ తల్లి జాతరలో పాల్గొని ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థించారు. అనంతరం ఇల్లంతకుంట మార్కెట్ యార్డును సందర్శించిన ఎమ్మెల్యే.. ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిని పరిశీలించి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. కొనుగోళ్లలో జాప్యం, తూకం, చెల్లింపుల ఆలస్యంపై రైతులు తెచ్చిన...