నేలకొండపల్లి బౌద్ధ స్తూపానికి రూపురేఖలు!
నేలకొండపల్లి బౌద్ధ స్తూపానికి రూపురేఖలు! రూపుదిద్దుకుంటున్న సమగ్ర మాస్టర్ ప్లాన్ మంత్రి పొంగులేటి ఆదేశాలతో రంగంలోకి అధికారులు వారసత్వ శాఖ ఉన్నత స్థాయి బృందం క్షేత్రస్థాయి పరిశీలన కాకతీయ, పాలేరు : ఖమ్మం జిల్లాలోని చారిత్రక నేలకొండపల్లి బౌద్ధ మహాస్తూపాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ క్షేత్రం అభివృద్ధి కోసం ఇప్పటికే రెండు కోట్ల యాభై లక్షల రూపాయల నిధులు...