భిక్షాటనం చేస్తూ వీఓఏల వినూత్న నిరసన

భిక్షాటనం చేస్తూ వీఓఏల వినూత్న నిరసన ఐకేపీ వీఓఏల నిరవధిక సమ్మె ఉధృతం సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం తప్పదు : జేఏసీ హెచ్చరిక కాకతీయ, ఏన్కూర్ : తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండల కేంద్రంలో ఐకేపీ వీఓఏలు (గ్రామ సంఘ సహాయకులు) చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం నాటికి కూడా కొనసాగింది. ఇందులో భాగంగా వీఓఏల జేఏసీ మండల అధ్యక్షుడు జంపాల రమేష్ ఆధ్వర్యంలో వీఓఏలు రోడ్లపై భిక్షాటనం చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు....