రోగుల ప్రాణాలతో చెలగాటమా..?

రోగుల ప్రాణాలతో చెలగాటమా..? బ్లడ్ టెస్ట్ రిపోర్టుల జాప్యంపై రోగి ఆవేదన.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారుల పనితీరుపై విమర్శలు కాకతీయ,శంకరపట్నం:మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బ్లడ్ టెస్ట్ రిపోర్టుల జాప్యంపై రోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రానికి చెందిన హరీష్ అనే వ్యక్తి ఈ నెల 27న ఆసుపత్రిలో బ్లడ్ టెస్ట్ చేయించుకోగా, మరుసటి రోజున రిపోర్టు అందిస్తామని సిబ్బంది తెలిపినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా రిపోర్టు సిద్ధమైన తర్వాత మొబైల్‌కు మెసేజ్‌తో పాటు లింక్ కూడా వస్తుందని చెప్పినప్పటికీ...