‘మోడీ’ చేతిలో కీలుబొమ్మగా ఈడీ

‘మోడీ’ చేతిలో కీలుబొమ్మగా ఈడీ కేరళ మాజీ సీఎంపై దాడులు రాజకీయ కక్షసాధింపే సీపీఎం సీనియర్ నాయకుడు రవికుమార్ ధ్వజం కాకతీయ, దుమ్ముగూడెం : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలపై కక్షసాధింపునకు దిగుతోందని సీపీఎం సీనియర్ నాయకుడు రవికుమార్ ధ్వజమెత్తారు. ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) పూర్తిగా మోడీ చేతిలో కీలుబొమ్మగా మారిందని విమర్శించారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై ఈడీ జరిపిన దాడులకు నిరసనగా శుక్రవారం దుమ్ముగూడెం మండల కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా...