ఆకలికి అడ్డుకట్ట.. పేదలకు నెలనెలా ఉచిత బియ్యం
ఆకలికి అడ్డుకట్ట.. పేదలకు నెలనెలా ఉచిత బియ్యం నర్సక్కపేటలో ఐదేళ్ల పాటు బియ్యం పంపిణీ చేస్తామన్న సర్పంచ్ శంకరమ్మ కాకతీయ, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నర్సక్కపేట గ్రామంలో పేద కుటుంబాలకు సర్పంచ్ బెంద్రం శంకరమ్మ ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని నిరుపేదలకు ప్రతి నెల 10 కిలోల చొప్పున బియ్యం అందజేస్తూ సామాజిక బాధ్యతను చాటుతున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ శంకరమ్మ మాట్లాడుతూ, గ్రామంలోని పేద ప్రజలకు అండగా నిలవాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. గ్రామ...