అత్తింటి వారు బైక్ కొనివ్వ‌లేద‌ని ఘాతుకం

అత్తింటి వారు బైక్ కొనివ్వ‌లేద‌ని ఘాతుకం భార్య‌ను చంపి.. ఆత‌ర్వాత భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌ సంగారెడ్డి జిల్లా మారేప‌ల్లి గ్రామంలో విషాదం కాక‌తీయ‌, సంగారెడ్డి : అదనపు కట్నం వేధింపులు, బైక్ కొనివ్వలేదనే వివాదం ఒక పచ్చని సంసారంలో చిచ్చుపెట్టింది. అత్తింటి వారు బైక్ కొనివ్వడం లేదనే కోపంతో ఓ భర్త కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేసి, ఆపై తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ హృదయ విదారక ఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల పరిధిలోని మారేపల్లి గ్రామంలో శనివారం వెలుగుచూసింది. స్థానికుల...