గడపగడపకూ బీఎస్పీ!
గడపగడపకూ బీఎస్పీ! బూత్ కమిటీల బలోపేతంపై ప్రత్యేక దృష్టి స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యాచరణ నియోజకవర్గ సమీక్షలో నేతలకు దొడ్డె సమ్మయ్య పిలుపు కాకతీయ, హుజురాబాద్ : బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి సెక్టార్, బూత్ కమిటీల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు దొడ్డె సమ్మయ్య నాయకులకు సూచించారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం ఆదివారం జమ్మికుంటలో జరిగింది. నియోజకవర్గ అధ్యక్షుడు మంద సమ్మయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ...