పాత పనులకే కొత్త శిలాఫలకాలు!

పాత పనులకే కొత్త శిలాఫలకాలు! విలీన గ్రామాలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచార ఆర్భాటమే తప్ప కాంగ్రెస్ మార్క్ ప్రగతి శూన్యం మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నిప్పులు కాకతీయ, గీసుగొండ : బీఆర్ఎస్ హయాంలో మంజూరైన పనులకే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త శిలాఫలకాలు వేస్తూ ప్రజలను మోసం చేస్తోందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ధ్వజమెత్తారు. వరంగల్ మహానగర పాలక సంస్థ 15వ డివిజన్ పరిధిలోని మొగిలిచెర్ల, గోపాలరెడ్డి నగర్, రెడ్డిపాలెం గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో...