సీఎంఆర్ఎఫ్ చెక్కుల మాయాజాలం!

సీఎంఆర్ఎఫ్ చెక్కుల మాయాజాలం! గడువు ముగిసినా లబ్ధిదారులకు అందని సహాయం.. చెక్కులు మాయం.. అధికారుల నిర్లక్ష్యమా? లేక పెద్ద స్కామా? పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ ప్రజల ఆగ్రహం బాధ్యులపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ కాకతీయ, వేములవాడ : వేముల‌వాడ నియోజ‌క‌వ‌ర్గం చందుర్తి మండ‌లంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కుల వ్యవహారం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ప్రాణాపాయ స్థితిలో ఉండి, వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడుతున్న పేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన అత్యవసర నిధుల చెక్కులే గల్లంతవుతున్నాయన్న...