ఇందిరమ్మ ఇళ్లతో కొత్త జీవితానికి శ్రీకారం
ఇందిరమ్మ ఇళ్లతో కొత్త జీవితానికి శ్రీకారం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సిరికొండలో ఎనిమిది ఇళ్ల ప్రారంభం కాకతీయ, ఇల్లంతకుంట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం ద్వారా పేద కుటుంబాల సొంతింటి కల సాకారమవుతోందని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ విభాగం (సెల్) చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఇల్లంతకుంట మండలం సిరికొండ గ్రామంలో నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఎనిమిది మంది లబ్ధిదారులు మంగళవారం సామూహిక గృహప్రవేశాలు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై...