రూ.19.18 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
రూ.19.18 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కాకతీయ,ఇల్లంతకుంట : ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) పెద్ద భరోసాగా నిలుస్తోందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన 72 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.19,18,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంగళవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్యం, ప్రమాదాలు, అత్యవసర వైద్య చికిత్సల కారణంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు....