ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు
ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు కాకతీయ, పెద్దవంగర : పెద్దవంగర మండలంలో మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ వేణుమాధవ్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వినోద్, పోలీస్ స్టేషన్‌లో ఎస్సై ప్రమోద్ కుమార్ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. అలాగే రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య జెండాలను ఎగురవేశారు. మండల పరిధిలోని ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్‌లు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు...