మరణంలోనూ వెంటాడిన కులం..!

మరణంలోనూ వెంటాడిన కులం..! అంత్యక్రియల వేళ వివక్ష ఆరోపణలు వీణవంక మండలంలో కలకలం ట్రాక్టర్ డ్రైవర్‌ను తొలగించాలని అంబేద్కర్ సంఘం డిమాండ్ కాకతీయ, కరీంనగర్ వీణవంక : కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింహులపల్లి గ్రామంలో కుల వివక్ష ఆరోపణలు కలకలం రేపాయి. గ్రామానికి చెందిన వంతడుపుల పోచమ్మ ఇటీవల మృతిచెందగా, ఆమె దహన సంస్కారాల కోసం గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ను కేటాయించాలని కుటుంబ సభ్యులు సర్పంచ్‌ను ఆశ్రయించారు. సర్పంచ్ అనుమతి ఇచ్చినప్పటికీ, ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్  కందం కిషన్‌రావు వాహనం నడిపేందుకు నిరాకరించాడని బాధిత కుటుంబ...