వంకాయగూడెంలో ఉచిత మెగా వైద్య శిబిరం

వంకాయగూడెంలో ఉచిత మెగా వైద్య శిబిరం కాకతీయ,శంకరపట్నం : మండలంలోని వంకాయగూడెం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో బుధవారం గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రముఖ ఆసుపత్రులైన మెడికవర్ హాస్పిటల్, శరత్ కళ్ళ హాస్పిటల్ వైద్య బృందాలు పాల్గొని ఉచితంగా సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి వైద్య సూచనలు, మందులు అందజేశారు. గ్రామ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు...