అకాల వర్షానికి ఇల్లు ధ్వంసం..
అకాల వర్షానికి ఇల్లు ధ్వంసం.. ఈదురుగాలులకు విరిగిపడ్డ చెట్టు కాకతీయ, జూలూరుపాడు : జూలూరుపాడు మండలం వినోబానగర్ గ్రామ పంచాయతీలో మంగళవారం రాత్రి వీచిన ఈదురుగాలులు, అకాల వర్షానికి భారీ చింతచెట్టు కూలి సిరికొండ లక్ష్మి అనే వృద్ధురాలి నివాసం పూర్తిగా ధ్వంసమైంది. ఈ దుర్ఘటన గురించి తెలుసుకున్న వెంటనే వినోబానగర్ సర్పంచ్ గంగావత్ నవీన్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో నష్టాన్ని పరిశీలించి బాధిత వృద్ధురాలిని ఓదార్చారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆమె దీనస్థితిని చూసి చలించిన...