పెద్దవంగర మండలంలో గంజాయి గుర్తింపు కిట్లు
పెద్దవంగర మండలంలో గంజాయి గుర్తింపు కిట్లు కేవలం ఒక్క నిమిషంలోనే గంజాయి తాగినట్లు నిర్ధారణ : ఎస్సై ప్రమోద్ కుమార్ కాకతీయ, పెద్దవంగర : గంజాయి సేవించిన వారిని తక్షణమే పట్టుకునేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన గంజాయి గుర్తింపు కిట్లు అందుబాటులోకి వచ్చాయని ఎస్సై ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ కిట్ల ద్వారా కేవలం ఒక్క నిమిషంలోనే సదరు వ్యక్తి గంజాయి తీసుకున్నాడా లేదా అనే విషయాన్ని నిర్ధారించవచ్చని ఆయన పేర్కొన్నారు. మండలంలో గంజాయిని పూర్తిగా అరికట్టేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక...