ఘనంగా వాసవీ మాత పారాయణం

ఘనంగా వాసవీ మాత పారాయణం వాసవి గార్డెన్స్‌లో భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన కాకతీయ, చేర్యాల : ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మాత, మణిద్వీప వర్ణన పారాయణం స్థానిక వాసవి గార్డెన్స్‌లో శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి పలు రకాల నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీశ్రీశ్రీ పూజ్య శ్రీ లక్ష్మి నారాయణ గురు భవాని హాజరై పారాయణం విశిష్టతను భక్తులకు వివరించారు....