వర్షకాలంపై ప్రణాళికతో సన్నద్ధంగా ఉండాలి
వర్షకాలంపై ప్రణాళికతో సన్నద్ధంగా ఉండాలి వరంగల్ కలెక్టర్ సత్య శారద కాకతీయ, దుగ్గొండి : వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో పారిశుధ్యం, ప్రజారోగ్యం, వరద నివారణపై అధికారులు, ప్రజలు సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని కలెక్టర్ సత్య శారద సూచించారు. దుగ్గొండి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో సర్పంచ్ కామిశెట్టి ప్రశాంత్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన ప్రత్యేక గ్రామసభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని,...