శ్రీరాముడికి రైతుల ముడుపు

శ్రీరాముడికి రైతుల ముడుపు అకాల వర్షాల నుంచి పంటలను కాపాడిన దైవానికి కృతజ్ఞత గంభీరావుపేటలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ వైభవంగా సీతారామచంద్ర స్వామి రథోత్సవం కాకతీయ, గంభీరావుపేట : అకాల వర్షాలు, వడగళ్ల వానల నుంచి పంటలను కాపాడాలని కోరుతూ గంభీరావుపేట మండల కేంద్రంలోని రైతులు కట్టిన ముడుపును ఆదివారం వైభవంగా విప్పారు. ఈ సందర్భంగా రైతులు స్థానిక సీతారామచంద్ర స్వామి వారికి విశేష పూజలు నిర్వహించి, స్వామివారిని రథంపై ఉంచి భజనలు, కోలాటాల నడుమ గ్రామ వీధుల్లో ఊరేగించారు. మహిళలు మంగళహారతులతో స్వామివారికి...