రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి

రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి కాకతీయ, రుద్రంగి : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. చందుర్తి మండలం కట్ట లింగంపేట గ్రామానికి చెందిన ఎల్లా శ్రీనివాస్ ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశమైన మస్కట్‌లో పనిచేస్తూ ఇటీవలే స్వదేశానికి వచ్చాడు. మంగళవారం రుద్రంగి మండల కేంద్రంలో తన సామాన్లు తీసుకున్న అనంతరం తిరిగి ద్విచక్ర వాహనంపై...