ప్రతి ఇంటా మొక్కలు.. ప్రతి గ్రామం పచ్చదనం
ప్రతి ఇంటా మొక్కలు.. ప్రతి గ్రామం పచ్చదనం ఎంపీడీఓ వెన్న కృష్ణవేణి పిలుపు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై అవగాహన ప్రత్యేక గ్రామసభల్లో ప్రజల భాగస్వామ్యానికి పిలుపు కాకతీయ, గీసుగొండ : వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఇల్లాలు తమ ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటి సంరక్షించాలని ఎంపీడీఓ వెన్న కృష్ణవేణి పిలుపునిచ్చారు. గ్రామాల అభివృద్ధి, పరిశుభ్రత, పచ్చదనం కోసం ప్రజలంతా భాగస్వాములు కావాలని సూచించారు. మండలంలోని బొడ్డు చింతలపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్–2026పై అవగాహన...