కేసుల దర్యాప్తులో జాప్యం వద్దు : ఎస్పీ మహేష్ బి. గితే

కేసుల దర్యాప్తులో జాప్యం వద్దు : ఎస్పీ మహేష్ బి. గితే వేములవాడ సబ్-డివిజన్ పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం కాకతీయ, వేములవాడ : జిల్లాలో నమోదయ్యే ప్రతి కేసులో పారదర్శకమైన, నిష్పాక్షికమైన దర్యాప్తు చేపట్టి నిందితులకు శిక్షలు పడేలా చూడాలని రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి. గితే పోలీసు అధికారులను ఆదేశించారు. వేములవాడ సబ్-డివిజన్ అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్ కేసులు, నాన్-బెయిలబుల్ వారెంట్ల అమలు, దర్యాప్తు పురోగతిపై సమగ్రంగా సమీక్షించారు. దీర్ఘకాలిక పెండింగ్ కేసుల...