ఇందుర్తిలో కిరాణా వ్యాపారుల నిలువు దోపిడీ
ఇందుర్తిలో కిరాణా వ్యాపారుల నిలువు దోపిడీ కాకతీయ, చిగురుమామిడి: ఇందుర్తి గ్రామంలోని కిరాణా దుకాణాల్లో వ్యాపారులు సామాన్య ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు. ప్యాక్ చేసిన నిత్యావసరాలు, కూల్‌డ్రింక్స్, పాలు, పెరుగు వంటి పదార్థాలపై ముద్రించిన ఎమ్మార్పీ కంటే రూ. 3 నుండి రూ. 6 వరకు అదనంగా వసూలు చేయడం నిత్యకృత్యంగా మారింది. ప్రశ్నిస్తే గిట్టుబాటు కావడం లేదని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు. అంతేకాకుండా, నిబంధనలను తుంగలో తొక్కి కాలం చెల్లిన బిస్కెట్లు, చాక్లెట్లు, కుర్కురే ప్యాకెట్లను విక్రయిస్తూ చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అధికారులకు ఫిర్యాదు...