బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి : కలెక్టర్

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి : కలెక్టర్ కాకతీయ, కరీంనగర్: ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో ఆమె కార్మిక శాఖ రూపొందించిన అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. 14 సంవత్సరాల లోపు పిల్లలను పనుల్లో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పిల్లలు బాల కార్మికులుగా మారకుండా, పాఠశాలలకు వెళ్లి విద్యను అభ్యసించేలా చూడటం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని...