పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కాకతీయ,శంకరపట్నం:మండలంలోని కన్నాపూర్ గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1993 నుంచి 1998 వరకు ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న పూర్వ విద్యార్థులు పాఠశాల రోజుల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ఉపాధ్యాయులు అందించిన విద్య, మార్గదర్శకత్వం తమ జీవితాల్లో...