మిడ్‌డే మీల్‌లో అవకతవకలపై ఫిర్యాదు
మిడ్‌డే మీల్‌లో అవకతవకలపై ఫిర్యాదు కోర్టు కేసు వివరాలు వెల్లడించాలని డిమాండ్ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు వద్దు పదేళ్ల వివాదానికి శాశ్వత పరిష్కారం కావాలంటూ గ్రీవెన్స్‌లో దరఖాస్తు కాకతీయ, చిగురుమామిడి : మండలంలోని ఇందుర్తి గ్రామ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వహణకు సంబంధించి గత పదేళ్లుగా కొనసాగుతున్న వివాదంపై సమగ్ర విచారణ జరిపించాలని గ్రామస్తులు, సమాఖ్య సంఘాల నాయకురాళ్లు కోరారు. ఎంపీపీఎస్, జడ్పీహెచ్ఎస్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వహణ విషయంలో రెండు గ్రూపుల మధ్య వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థుల చదువులకు ఆటంకం...