తాడిచర్ల ఓపెన్‌కాస్ట్ గనిలో పర్యావరణ తనిఖీలు
తాడిచర్ల ఓపెన్‌కాస్ట్ గనిలో పర్యావరణ తనిఖీలు కేంద్ర పర్యావరణ శాఖ అధికారి డాక్టర్ ఎం.టి. కరుప్పయ్య పర్యవేక్షణ కాకతీయ, మలహర్ : తాడిచర్ల-1 ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనిలో పర్యావరణ అనుమతుల నిబంధనల అమలును కేంద్ర పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ అధికారి డాక్టర్ ఎం.టి. కరుప్పయ్య రెండు రోజుల పాటు క్షుణ్ణంగా పరిశీలించారు. గనిలో చేపడుతున్న దుమ్ము నియంత్రణ చర్యలు, గాలి-నీటి నాణ్యత పర్యవేక్షణ, హరితహారం, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలను ఆయన స్వయంగా తనిఖీ చేశారు. గని యాజమాన్యం సమర్పించిన పునరావాస కార్యక్రమాలు,...