ఖ‌మ్మం ఘ‌ట‌న‌లో నిందితుడిని కఠినంగా శిక్షించాలి

ఖ‌మ్మం ఘ‌ట‌న‌లో నిందితుడిని కఠినంగా శిక్షించాలి రజక సంఘం నాయ‌కుడు నాంపెల్లి శంకరయ్య డిమాండ్ కాకతీయ,శంకరపట్నం: ఖమ్మం జిల్లాలో 12 ఏళ్ల బాలికపై జరిగిన దారుణ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని రజక సంఘం మానకొండూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నాంపెల్లి శంకరయ్య డిమాండ్ చేశారు. మండలంలోని మొలంగూర్ గ్రామంలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని కోరారు. బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం కింద రూ.10...