మా పిల్లలు ప్రభుత్వ బడికే
మా పిల్లలు ప్రభుత్వ బడికే మానాల గ్రామస్తుల చారిత్రాత్మక తీర్మానం ప్రైవేట్ పాఠశాల బస్సులకు నో ఎంట్రీ ప్రభుత్వ పాఠశాల పరిరక్షణకు ఏకగ్రీవ నిర్ణయం కాకతీయ, వేములవాడ/రుద్రంగి : ప్రభుత్వ విద్యను పరిరక్షించి, గ్రామంలోని పాఠశాలను విద్యార్థులతో కళకళలాడేలా చేయాలనే సంకల్పంతో రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామస్తులు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల సంఖ్య తగ్గి పాఠశాల మూతపడే పరిస్థితి రావడంతో.. గ్రామంలోని చిన్నారులందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని గ్రామసభలో ఏకగ్రీవంగా తీర్మానించారు. గ్రామస్తుల నిర్ణయాన్ని అమలు చేసే దిశగా...