ఎస్‌ఐఆర్ సర్వేను పారదర్శకంగా చేపట్టాలి
ఎస్‌ఐఆర్ సర్వేను పారదర్శకంగా చేపట్టాలి నిర్ణీత గడువులోగా సర్వేను పూర్తి చేయాలి ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్త వహించాలి దుగ్గొండి తహసీల్దార్ సమ్మక్క కాకతీయ, దుగ్గొండి: ఎస్‌ఐఆర్ సర్వే ప్రక్రియను బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌వోలు) అత్యంత బాధ్యతాయుతంగా, పారదర్శకంగా నిర్వహించాలని దుగ్గొండి తహసీల్దార్ సమ్మక్క సూచించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో బీఎల్‌వోల కోసం నిర్వహించిన శిక్షణ శిబిరంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సర్వే నిర్వహణలో భాగంగా ప్రతి ఇంటిని సందర్శించి అర్హుల వివరాలను క్షుణ్ణంగా నమోదు చేయాలని ఆమె...