ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాల పంపిణీ
ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాల పంపిణీ కాకతీయ, రుద్రంగి : రుద్రంగి మండలం మానాల గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బుర్ర శంకర్, ఉప సర్పంచ్ దాసరి అశోక్ పాల్గొని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బుర్ర శంకర్ మాట్లాడుతూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు ప్రభుత్వ పాఠశాలలే పునాది అని, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి గ్రామపంచాయతీ సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ...