మా ఊర్లోకి ప్రైవేటు పాఠశాలల బస్సులు నిషేధం
మా ఊర్లోకి ప్రైవేటు పాఠశాలల బస్సులు నిషేధం ప్రభుత్వ విద్యకే పెద్దపీట.. సంక్షేమ పథకాల్లో తొలి ప్రాధాన్యం రేపాక, పెద్దలింగాపూర్ గ్రామాల చారిత్రాత్మక నిర్ణయం ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా కీలక తీర్మానం కాకతీయ, ఇల్లంతకుంట : ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రేపాక, పెద్దలింగాపూర్ గ్రామ పంచాయతీలు సంచలన నిర్ణయాలు తీసుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించే తల్లిదండ్రులను ప్రోత్సహించాలని, ప్రైవేట్ విద్యాసంస్థల ప్రభావాన్ని తగ్గించాలని ఆయా గ్రామ పాలకవర్గాలు ఏకగ్రీవంగా...