గురునాథం చెరువులో ‘ఇసుక’ దోపిడీ
గురునాథం చెరువులో 'ఇసుక' దోపిడీ నిబంధనలకు పాతర.. జేసీబీలతో అక్రమ తవ్వకాలు సహజ వనరుల విధ్వంసం.. భూగర్భ జలాలపై పెను ప్రభావం అక్రమార్కుల కనుసన్నల్లో ఇసుక రవాణా నిమ్మకునీరెత్తినట్లుగా అధికారులు.. పట్టించుకోని అధికార యంత్రాంగం! కాకతీయ, చందుర్తి : కరీంనగర్ జిల్లా చందుర్తి మండలం కట్టలింగంపేట గ్రామ పరిధిలోని గురునాధం చెరువు అక్రమార్కుల అడ్డాగా మారుతోంది. అనుమతులు లేకపోయినా, ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండా ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నా, సంబంధిత అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జేసీబీలతో చెరువును తవ్వుతూ, గుర్తు...