ప్రజా సమస్యలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం

ప్రజా సమస్యలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కాకతీయ, పరకాల: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించి పాలన సాగిస్తోందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. ఈ నెల 22వ తేదీన దామెర మండల కేంద్రంలోని ఏఎన్‌ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించనున్న పరకాల నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం పార్టీ నాయ‌కుల‌తో హ‌న్మ‌కొండ‌లోని...