ఓం’కు బదులుగా ‘జాం’

ఓం'కు బదులుగా 'జాం' ప్రజాప్రతినిధుల సమక్షంలోనే అక్షర దోషం ఉపాధ్యాయురాలి పొరపాటుపై తల్లిదండ్రుల ఆగ్రహం కాకతీయ, చేర్యాల: వీరన్నపేట ప్రాథమిక పాఠశాలలో సోమవారం జరిగిన అక్షరాభ్యాసం కార్యక్రమంలో అక్షర దోషం చోటుచేసుకుంది. గ్రామ ప్రజాప్రతినిధుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో, విద్యార్థి పలకపై 'ఓం' అని రాయించాల్సిన చోట, సంబంధిత ఉపాధ్యాయురాలు 'జాం' అని రాయడం చర్చనీయాంశమైంది. అక్షరాభ్యాసం వంటి పవిత్రమైన కార్యక్రమంలో బాధ్యతారహితంగా వ్యవహరించడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల సమక్షంలోనే ఈ తప్పు జరగడం బోధన నాణ్యతపై ప్రశ్నలను...