షెడ్డు తాళాలు ప‌గుల‌గొట్టి జీవాల అపహరణ

షెడ్డు తాళాలు ప‌గుల‌గొట్టి జీవాల అపహరణ రూ.3.17 లక్షల విలువైన గొర్రెలను ఎత్తుకెళ్లిన దుండగులు ఆచూకీ కోసం గాలిస్తున్న గీసుగొండ పోలీసులు కాకతీయ, గీసుగొండ : అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు రేకుల షెడ్డు తలుపులు తెరిచి 25 గొర్రె పొట్టేళ్లు, ఒక మేకను చోరీ చేసిన ఘోర ఘటన గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. గీసుగొండ సీఐ డీ.విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) 16వ డివిజన్ ధర్మారం గ్రామానికి చెందిన గొర్రెల వ్యాపారి రాజబోయిన...