ఈఓ డ్రైవర్‌కు టికెట్ కౌంటర్ బాధ్యతలు
ఈఓ డ్రైవర్‌కు టికెట్ కౌంటర్ బాధ్యతలు కొండగట్టు ఆలయంలో ఇష్టారాజ్యం కాకతీయ, కరీంనగర్/కొండగట్టు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో విధుల నిర్వహణపై వివాదం రాజుకుంది. ఆలయ ఈఓ అంజనా రెడ్డికి వ్యక్తిగత కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తి, ఏకంగా ఆలయ ఉద్యోగిలా టికెట్ క్యాష్ కౌంటర్ వద్ద విధులు నిర్వహిస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిత్యం వేల రూపాయల నగదు లావాదేవీలు జరిగే అత్యంత కీలకమైన కౌంటర్ వద్ద, అధికారిక నియామకం లేని వ్యక్తికి బాధ్యతలు అప్పగించడంపై భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం...