ఎంతసేపు జీఎంను లేపాలా.. ఎండీని లేపాలా…
ఎంతసేపు జీఎంను లేపాలా.. ఎండీని లేపాలా... ఈ ఆలోచనలతో జీవితం నాశనమవుతోంది ఇసుక కాంట్రాక్టర్ శ్రీకర్‌తో అధికారి సంభాషణ.. కాకతీయ చేతిలో ఆడియో ..! కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాకతీయ, తెలంగాణ బ్యూరో : మణుగూరు ఇసుక ర్యాంపుల్లో కొనసాగుతున్న అక్రమాల్లో అధికారుల పాత్ర కీలకమనే విషయం తేటతెల్లమవుతోంది. కాంట్రాక్టర్లతో అంటకాగుతూ..వారి కనుసన్నల్లోనే అధికారులు పనిచేస్తున్నారనడానికి కాకతీయకు చిక్కిన ఆడియో ప్రస్పుటం చేస్తోంది. ఇసుక ర్యాంపులతో తనకు ఏమాత్రం సంబంధం లేదని వాదిస్తున్న శ్రీకర్‌తో అధికారులు ఎంతో చనువుగా సంభాషిస్తున్న ఆడియో కాకతీయ...