ప్రభుత్వ పాఠశాలకు పూర్వ విద్యార్థుల బాసట

ప్రభుత్వ పాఠశాలకు పూర్వ విద్యార్థుల బాసట మళ్లీ విద్యాజ్యోతిని వెలిగించేందుకు సన్నద్ధం కాకతీయ, మలహర్: మండల కేంద్రమైన తాడిచర్ల వెల్మలపల్లిలోని ఉన్నత ప్రాథమిక పాఠశాల మళ్లీ కళకళలాడనుంది. ఒకప్పుడు వందలాది మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన ఈ పాఠశాల, విద్యార్థుల కొరత కారణంగా కొన్ని ఏళ్ల క్రితం మూతపడింది. సరైన నిర్వహణ లేక శిథిలావస్థకు చేరిన ఈ బడికి, అక్కడ చదివి స్థిరపడిన పూర్వ విద్యార్థులు ఇప్పుడు ఆశాకిరణంగా మారారు. తమ బాల్య జ్ఞాపకాలకు నిలయమైన పాఠశాలను మళ్లీ విద్యార్థుల కేరింతలతో నింపాలని భావించిన...