పాన్ షాపులకేనా నిబంధనలు..?

పాన్ షాపులకేనా నిబంధనలు..? బార్లు, వైన్ షాపులకు వర్తించవా..? కరీంనగర్‌లో హాట్‌టాపిక్‌గా మారిన ‘100 మీటర్ల’ వివాదం చిన్న వ్యాపారులపైనే దండయాత్ర.. పెద్దలకు మినహాయింపులా? చట్టం ముందు అందరూ సమానమేనని నిరూపించాలంటున్న స్థానికులు కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : విద్యాసంస్థలకు సమీపంలో పాన్ షాపుల తొలగింపుపై అధికారులు వరుస చర్యలు చేపడుతుండగా, అదే నిబంధనలు బార్లు, వైన్ షాపుల విషయంలో ఎందుకు అమలు కావడం లేదన్న ప్రశ్న కరీంనగర్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. "చట్టం ఒకరికి ఒకలా.. ఇంకొకరికి ఇంకోలా ఉంటుందా?" అంటూ సామాన్య ప్రజలు...