ప్రకృతి బ్లెస్సి పచ్చని సంకల్పం!
ప్రకృతి బ్లెస్సి పచ్చని సంకల్పం! అడవికి ఊపిరి పోస్తున్న 'బాల' వనం కాకతీయ, వేములవాడ : వయసు పన్నెండేళ్లు.. కానీ ఆ చిన్నారి భుజాన వేసుకున్న బాధ్యత మాత్రం ఎంతో గురుతరమైనది. చేతిలో స్మార్ట్‌ఫోన్లతో కాలక్షేపం చేసే ఈ తరం పిల్లల మధ్య, విత్తనాల సంచి పట్టుకుని అడవుల కోసం అడుగులు వేస్తోంది రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన ప్రకృతి బ్లెస్సి. భవిష్యత్ తరాలకు పచ్చని భూమిని అందించాలనే దృఢ సంకల్పంతో ఈ బాల యోధురాలు చేస్తున్న పర్యావరణ...