ఎస్ఐఆర్‌పై కాంగ్రెస్ అప్రమత్తం
ఎస్ఐఆర్‌పై కాంగ్రెస్ అప్రమత్తం దొంగ ఓట్లను అడ్డుకోవాలి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పిలుపు కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీలోని 7వ వార్డులో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ సందర్భంగా జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పార్టీ బీఎల్ఏలు, నాయకులు మరియు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా చూడటం మరియు ఓట్లు గల్లంతు కాకుండా జాగ్రత్త వహించడం పార్టీ శ్రేణుల బాధ్యత అని స్పష్టం చేశారు....