ప్రభుత్వ విప్‌పై బురదజల్లే కుట్రలు
ప్రభుత్వ విప్‌పై బురదజల్లే కుట్రలు వరి ధాన్యం అక్రమాల్లో దోషులను కాపాడేందుకే దుష్ప్రచారం కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రెటరీ తుమ్ జలపతి కాకతీయ, రుద్రంగి: జిల్లాలో సంచలనం రేపిన వరి ధాన్యం కొనుగోలు అక్రమాల వ్యవహారంలో అసలు దోషులను కాపాడేందుకే ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌పై బీఆర్ఎస్ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. రుద్రంగి మండలం మానాల గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా జనరల్ సెక్రెటరీ తుమ్ జలపతి, మార్కెట్ కమిటీ డైరెక్టర్...