తొమ్మిదేళ్లుగా తాత్కాలిక భవనాలే శరణ్యం!

తొమ్మిదేళ్లుగా తాత్కాలిక భవనాలే శరణ్యం! తహసీల్దార్, వ్యవసాయ శాఖ కార్యాలయాలకు కరువైన శాశ్వత భవనాలు రూ.2.50 కోట్ల నిధులున్నా ముందుకు సాగని పోలీస్ స్టేషన్ నిర్మాణం కాకతీయ, రుద్రంగి : ప్రజలకు పరిపాలనను చేరువ చేయాలనే లక్ష్యంతో రెండు వేల పదహారులో ఏర్పాటైన రుద్రంగి మండలం తొమ్మిదో ఏటా అడుగుపెడుతున్నా, కీలక ప్రభుత్వ శాఖలకు ఇప్పటికీ సొంత భవనాలు లేవు. మండల పరిపాలనకు వెన్నెముకైన తహసీల్దార్ కార్యాలయం, విద్యాశాఖ అధికారి కార్యాలయంలోనే కొనసాగుతోంది. ఒకే ఇరుకు భవనంలో రెవెన్యూ సేవలు, విద్యాశాఖ విధులు నిర్వహించాల్సి...