భక్తులతో కిటకిటలాడిన వేముల‌వాడ‌

భక్తులతో కిటకిటలాడిన వేముల‌వాడ‌ కాకతీయ, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి శుక్రవారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి చేరుకున్న భక్తులు స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం పర్వదినం కావడంతో ఆలయ ప్రాంగణం రోజంతా భక్తుల రద్దీతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు కోడె మొక్కులు, రుద్రాభిషేకం, అన్నపూజ, నిత్య కల్యాణం, చండీ హోమం...