‘కాకతీయ’ కథనానికి స్పంద‌న‌

'కాకతీయ' కథనానికి స్పంద‌న‌ ప్రభుత్వ పాఠశాల పునఃప్రారంభానికి రంగం సిద్ధం పాఠశాలను పరిశీలించిన ఎంఈవో, హెచ్‌ఎం పూర్వ విద్యార్థుల శ్రమదానానికి అధికారుల ప్రశంసలు కాకతీయ, మలహర్ : 'కాకతీయ' పత్రికలో ఇటీవల ప్రచురితమైన "మూతపడిన వెల్మలపల్లి ప్రభుత్వ పాఠశాల" కథనానికి సానుకూల స్పందన లభించింది. ఈ వార్తపై స్పందించిన మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో) లక్ష్మణ్, కాంప్లెక్స్ హెడ్మాస్టర్ తిరుపతితో కలిసి పాఠశాలను శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యార్థుల సంఖ్య తగ్గి మూతపడిన ఈ పాఠశాల ప్రాంగణం, గత కొన్నేళ్లుగా పిచ్చి మొక్కలతో నిండి...