నాచినపల్లిలో క్షుద్ర పూజల కలకలం
నాచినపల్లిలో క్షుద్ర పూజల కలకలం గుప్త నిధుల కోసమేనా?.. భయాందోళనలో గ్రామస్థులు పోలీసుల అదుపులో పూజారులు కాకతీయ, దుగ్గొండి: క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారనే సమాచారం గ్రామంలో కలకలం రేపింది. దుగ్గొండి మండలంలోని నాచినపల్లి గ్రామంలో ఓ ఇంటి వెనుక భాగంలో పట్టపగలు కొందరు సుమారు నాలుగు అడుగుల గుంత తవ్వి, జంతు బలికోసం ఏర్పాటు చేసుకొని అనుమానాస్పదంగా పూజలు నిర్వహిస్తుండటాన్ని గమనించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గుప్త నిధుల కోసం ఈ పూజలు నిర్వహిస్తున్నారా అనే అనుమానాలు గ్రామంలో చర్చనీయాంశంగా మారాయి. సమాచారం అందుకున్న...