పల్లెవెలుగు బస్సులకు ఎక్స్‌ప్రెస్ బోర్డులు
పల్లెవెలుగు బస్సులకు ఎక్స్‌ప్రెస్ బోర్డులు హుజూరాబాద్ ఆర్టీసీ తీరుపై ప్రయాణికుల ఆగ్రహం అయోమయంలో ప్రయాణికులు.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆర్టీసీ యాజమాన్యం డిపోలో బస్సుల కొరతే కారణమా? అనే సందేహాలు కాకతీయ, హుజూరాబాద్: హుజూరాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో విచిత్ర పరిస్థితి నెలకొంది. సామాన్యులకు రవాణా సదుపాయం కల్పించే పల్లెవెలుగు బస్సులకు, ఎక్స్‌ప్రెస్ సర్వీసు బోర్డులను తగిలించి నడపడం ప్రయాణికులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. బస్సు రకాన్ని బట్టి ఛార్జీలు, స్టేజీలు మారుతుండటంతో, ఏ సర్వీస్ ఏంటో తెలియక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీలో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్...