భూ సమీకరణపై రైతులతో అధికారుల చర్చలు

భూ సమీకరణపై రైతులతో అధికారుల చర్చలు కాకతీయ, కారేప‌ల్లి : సీతారామ ప్రాజెక్ట్‌లో భాగంగా చేపట్టనున్న భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) అంశంపై పాటిమీదిగుంపు గ్రామ పంచాయతీ ఆవరణలో గురువారం ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. సర్పంచ్ సుజాత-సంతోష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రాజెక్టు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు మరియు భూ సమీకరణ ప్రక్రియపై అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. ఈ గ్రామ సభలో ఎమ్మార్వో ఓరుగంటి వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ బి. పద్మ, ఫారెస్ట్ డిప్యూటీ రేంజర్,...